నిరుద్యోగుల ఆశలకు ఊపిరి.. సుంకిరెడ్డి జాబ్ డ్రైవ్ భరోసా.!

1001391828.jpg

కల్వకుర్తి,నవంబర్ 23: గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో నిర్వహిస్తున్న సుంకిరెడ్డి – ఉద్యోగ భరోసా కార్యక్రమం కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఆమనగల్‌లో నిర్వహించిన 25వ జాబ్ డ్రైవ్, మాడ్గులలో నిర్వహించిన 26వ జాబ్ డ్రైవ్‌లకు హాజరైన అభ్యర్థులకు తుక్కుగూడలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో విడతల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.25వ జాబ్ డ్రైవ్ ద్వారా ఇప్పటికే 104 మంది ఎంపిక కాగా,సోమవారం మరో 10 మందికి ఉద్యోగాలు లభించాయి. వీరిలో కల్వకుర్తి మండలానికి చెందిన ముగ్గురు, కడ్తాల్ మండలానికి చెందిన ఏడుగురు ఉన్నారు.దీంతో ఈ డ్రైవ్ ద్వారా ఉద్యోగాలు పొందిన వారి సంఖ్య 114కు చేరింది.అలాగే 26వ జాబ్ డ్రైవ్ ద్వారా ఇప్పటికే 71 మంది ఎంపిక కాగా,తాజాగా మరో 12 మందికి ఉద్యోగాలు లభించాయి.వీరంతా మాడ్గుల మండలానికి చెందినవారు కావడం విశేషం.దీంతో ఈ డ్రైవ్ ద్వారా ఉద్యోగాలు పొందిన వారి సంఖ్య 83కు చేరింది.రెండు జాబ్ డ్రైవ్‌ల ద్వారా ఇప్పటివరకు మొత్తం 197 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. మిగతా అభ్యర్థులకు కూడా విడతల వారీగా ఎంపిక ప్రక్రియ కొనసాగనుంది.ఈ సందర్భంగా ఐక్యత ఫౌండేషన్ ఛైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఉద్యోగాలు సాధించిన యువతకు అభినందనలు తెలిపారు. ఉద్యోగాల్లో చేరి ఉన్నత స్థాయికి ఎదగడంతో పాటు కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాలని ఆకాంక్షించారు.ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు ఎంపికైన అభ్యర్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ సభ్యులు చంద్రశేఖర్,నాగిళ్ల శివ తదితరులు పాల్గొన్నారు.

You may also like...