వెల్దండలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్.!

1001387985.jpg

రెండు స్విఫ్ట్ కార్లు, ఆరు సెల్‌ఫోన్లు, రూ.6,600 నగదు స్వాధీనం

వెల్దండ నవంబర్ 22 : వెల్దండ మండల పరిధిలో పేకాట ఆడుతున్న స్థావరంపై వెల్దండ పోలీసులు దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తిమ్మినోనిపల్లి గ్రామ శివారులోని కొట్ర చౌరస్తా సమీపంలో తిరుపతి బైపాస్ రోడ్డు పక్కన ఉన్న మామిడి తోటలో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు కుమ్మరి దశరథ్ (లేమూరు), బస్సు చిన్నారెడ్డి, బొజ్జ విద్యాసాగర్ రెడ్డి (తుమ్మలూరు), జాపాల బాబురావు (తుక్కుగూడ), కట్టగల మహేందర్ (తుమ్మలూరు), ఇరుగమల్ల నరసింహ (రాచలూరు)గా గుర్తించారు.వారి వద్ద నుంచి రెండు స్విఫ్ట్ కార్లు, ఆరు సెల్‌ఫోన్లు, రూ.6,600 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.పేకాట, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

You may also like...