పేదల సొంతింటి కళ ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం.. సర్పంచ్ యాదమ్మ వెంకటయ్య గౌడ్
- గిరిజనులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు: శంకర్ నాయక్ - November 22, 2026
- పేదల సొంతింటి కళ ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం.. సర్పంచ్ యాదమ్మ వెంకటయ్య గౌడ్ - November 22, 2026
- వెల్దండలో రూ.5.60 కోట్ల అభివృద్ధి పనులకు రేపు శ్రీకారం.. పాల్గొంటున్న ఎంపీ ఎమ్మెల్యే - November 22, 2026
వెల్దండ నవంబర్ 22:వెల్దండ మండల కేంద్రానికి చెందిన అన్నెపు లక్ష్మమ్మ (భర్త లింగమయ్య)కు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఆదివారం స్థానిక సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదల సొంతింటి కల నెరవేరుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. లబ్ధిదారులు నాణ్యతా ప్రమాణాలతో ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించారు.ఈ సందర్భంగా లబ్ధిదారురాలు లక్ష్మమ్మ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి, సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బస్నమోని శ్రీనివాస్, కార్యదర్శి గిరి, వార్డు సభ్యులు మారేపల్లి మంజుల శ్రీను, ముదికొండ కవిత రమేష్, పిల్లి దేవేందర్, ఎస్. శేఖర్, నాయకులు ఎండీ రషీద్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాదేపల్లి మల్లయ్య, బొక్కల శ్రీనివాస్, మట్ట భారత్, గడ్డం వెంకటయ్య, మల్లేష్, శివ తదితరులు పాల్గొన్నారు.
