గిరిజనులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు: శంకర్ నాయక్

1001387410.jpg

వెల్దండ నవంబర్ 22: తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్ గిరిజనులపై చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర గిరిజన హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బాణావత్ శంకర్ నాయక్ తీవ్రంగా ఖండించారు. ఆదివారం మండల కేంద్రంలోని గిరిజన భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాటంతో పాటు తెలంగాణ ఉద్యమంలో లంబాడాలు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. గిరిజనులపై అనవసర విమర్శలు చేయకుండా, సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలని హితవు పలికారు.ఈ సమావేశంలో మాజీ మండల అధ్యక్షుడు హరికిషన్ నాయక్, సర్పంచులు రమేష్ నాయక్,రవీందర్ నాయక్, గణ్యా నాయక్‌తో పాటు పలువురు గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.

You may also like...