Author: PAKADI RAMANJANEYULU
వెల్దండ:మండల పరిధిలోని గానుగట్టు తండా గ్రామపంచాయతీ పరిధిలోని పుష్కబోడు తండాలో గిరిజనుల ఆరాధ్యదైవం ముత్యాలమ్మ దేవాలయ నిర్మాణానికి మాజీ సర్పంచ్ పత్యానాయక్ రూ.1.05 లక్షల విరాళం అందించారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. విరాళం అందించిన పత్యానాయక్‌కు తండా ప్రజలు, ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా సమన్వయ కమిటీ కో-కన్వీనర్‌గా మట్ట మదన్ గౌడ్కల్వకుర్తి: కల్వకుర్తి విద్యానగర్‌లోని యూటీఎఫ్ భవన్లో జరిగిన జిల్లా కల్లుగీత సహకార సంఘాల అధ్యక్షుల సమావేశంలో మట్ట మదన్ గౌడ్‌ను జిల్లా సమన్వయ కమిటీ కో-కన్వీనర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘం బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం ఎన్నిక చేసిన కమిటీ సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు మదన్ గౌడ్‌ను అభినందించారు.
వెల్దండ: వియత్నాం దేశ పర్యటనలో భాగంగా వెల్దండకు చెందిన పలువురు ప్రముఖులు పర్యటించారు. పర్యటనలో భాగంగా తానాంగ్ ప్రాంతంలో కేబుల్ కార్లో ప్రయాణించి అక్కడి ప్రకృతి అందాలను వీక్షించారు.ఈ పర్యటనలో డీసీసీ ఉపాధ్యక్షులు, వెల్దండ మాజీ సర్పంచ్ ఎన్నం భూపతిరెడ్డి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా మాజీ అధ్యక్షులు బచ్చు రామకృష్ణ, డివిజన్ రెవెన్యూ అధ్యక్షులు సుదర్శన్‌రెడ్డి, రిటైర్డ్ ఉపాధ్యాయులు ఎన్నం కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ఆమనగల్ అక్టోబర్ 07:గంజాయి అక్రమ రవాణా, సేవనంపై కఠిన చర్యలు తప్పవని మహేశ్వరం జోన్ డీసీపీ నారాయణరెడ్డి హెచ్చరించారు. ఆమనగల్లు మార్కెట్ యార్డు సమీపంలో పోలీసులు, ఎస్ఓటీ బృందం నిర్వహించిన తనిఖీల్లో 17 ప్యాకెట్లలో ఉన్న సుమారు 35 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.నిందితులను అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రాంతానికి చెందిన కుంజం చందుబాబుదొర (26), కోసు వెంకటసాయిబాబు దొర (23)గా గుర్తించారు.వారి వద్ద గంజాయితో పాటు వివో మొబైల్ ఫోన్‌ను స్వాధీనం…
నాగర్ కర్నూల్: చిన్నంబావి మండల కేంద్రంలో కల్చరల్ బిల్డింగ్, స్టేడియం, పలు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం పరిశీలించారు. పెద్దమారూర్ గ్రామ రెవెన్యూ శివారులోని సర్వే నంబర్ 113లో సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు.కల్టివేషన్ లేకుండా బంజరు భూమిగా ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగించేలా సర్వే నిర్వహించాలని తహసీల్దార్‌ను మంత్రి ఆదేశించారు. అవసరమైన స్థలాన్ని గుర్తించి తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు.అనంతరం చిన్నంబావి మండల…
వెల్దండ అక్టోబర్ 7: డిండి–నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు పరిహారంపై స్పష్టత వచ్చే వరకు భూ సర్వేకు సహకరించేది లేదని తేల్చిచెప్పారు.బుధవారం వెల్దండ మండలం అజిలాపూర్‌లో అధికారులు పోలీసు బందోబస్తుతో చెట్ల లెక్కింపు చేపట్టగా, ముందస్తు సమాచారం ఇవ్వలేదంటూ రైతులు అడ్డుకున్నారు.సర్పంచ్ సిద్ధగోని రమేష్‌గౌడ్‌తో కలిసి రైతులు నిరసన తెలిపారు. పరిహారం పెంచడంతో పాటు భూములు కోల్పోతున్న ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిజర్వాయర్ కోసం 187 ఎకరాల…
వెల్దండ: వెల్దండ మండలానికి చెందిన బొక్కల నరసింహ తండ్రి రాములు ఇంటి నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం సిమెంట్ అందజేశారు.ఈ సందర్భంగా నరసింహ కుటుంబ సభ్యులు ఉప్పల వెంకటేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు కానుగుల జోగయ్య, మాజీ ఎంపీటీసీ చలిచీమల జ్యోతి నిరంజన్, బీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కొమ్ము నాగయ్య, బాదేపల్లి గోపాల్ కుమార్,…
పద్మమ్మ మృతికి సంఘ సేవకుడు రామన్న నివాళిఆమనగల్: ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు సాయినగర్ కాలనీకి చెందిన ఉల్లిగడ్డ రవికృష్ణ తల్లి, కీర్తిశేషులు మామిడి చెట్టి పద్మమ్మ మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకుడు పాపిశెట్టి రామన్న ఆమె నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంత్యక్రియల్లో పాల్గొన్న రామన్న, బంధువులతో కలిసి పార్థివ దేహాన్ని భుజాలపై మోస్తూ అంతిమయాత్రలో…
వెల్దండ అక్టోబర్ 06:నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యా శిశుమందిర్ నూతన భవనానికి స్లాబ్ నిర్మాణం కోసం ఉప్పల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు రూ.6 లక్షల రూపాయలతో ఉప్పల సేవా ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పాఠశాల భవనానికి స్లాబ్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు.ఈ సందర్భంగా పాఠశాల కమిటీ సభ్యులు, ఉప్పల సేవాదళ్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఉప్పల వెంకటేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
వెల్దండ అక్టోబర్ 06:పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులు పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కల్వకుర్తి పట్టణంలోని వైఆర్ఆర్ కాంప్లెక్స్‌లో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నవంబర్ 1, 2023 నాటికి డిగ్రీ పూర్తి…