Author: PAKADI RAMANJANEYULU

వెల్దండ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ.. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయం

జ్ఞాన తెలంగాణ,వెల్దండ ప్రతినిధి వంబర్ 27:వెల్దండ పోలీస్ స్టేషన్‌ను గద్వాల్ జోన్ ఇన్‌చార్జి డీఐజీ చందన దీప్తి,జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్, డీఎస్పీ శ్రీనివాసులు వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించి సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న అధికారులకు సిబ్బంది గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ ఆనర్) సమర్పించారు.అనంతరం పోలీస్ స్టేషన్‌లోని కేసుల నమోదు వివరాలు, వివిధ రికార్డులు, నిర్వహణ పద్ధతులను అధికారులు పరిశీలించారు. సిబ్బంది పనితీరును సమీక్షించి, విధుల…

తండాలకు గ్రామపంచాయతీ హోదా కల్పించిన ఘనత కేసీఆర్‌దే: అంజి మాస్టర్

వెల్దండ,నవంబర్ 27: తెలంగాణలో గిరిజన తండాల అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని బీఆర్ఎస్ వెల్దండ మండల నాయకుడు అంజి మాస్టర్ పేర్కొన్నారు.2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ద్వారా 500కు పైగా జనాభా ఉన్న అనేక గిరిజన తండాలు, గూడేలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశారని తెలిపారు. దీంతో తండాలకు సొంత సర్పంచులు, వార్డు సభ్యులు ఏర్పడి స్థానిక పాలనలో గిరిజనులకు భాగస్వామ్యం లభించిందన్నారు.గతంలో అభివృద్ధికి దూరంగా ఉన్న తండాల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్,…

పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం స్పష్టత ఇవ్వాలి.. యువ నేత చీమల అర్జున్ రెడ్డి

కల్వకుర్తి,నవంబర్ 26: పాలమూరు బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పాలమూరు ప్రాంత సాగునీటి సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని చీమర్ల అర్జున్ రెడ్డి డిమాండ్ చేశారు. అచ్చంపేట సభలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పెండింగ్ పనులు, కల్వకుర్తికి పూర్తిస్థాయి సాగునీరు, అచ్చంపేట రైతులకు నీటి సరఫరా, డిండి లిఫ్ట్ ప్రాజెక్టు అంశాలపై సీఎం స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు.పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని, డిండి లిఫ్ట్ ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరిని ప్రకటించాలని కోరారు….

రాజ్యాంగ విలువలను కాపాడాలి – సర్పంచ్ జంతుక వెంకటయ్య

ఆమనగల్,నవంబర్ 26: భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన చారిత్రాత్మక దినాన్ని పురస్కరించుకొని ఆమనగల్ మండలం పోలేపల్లి గ్రామపంచాయతీలో గురువారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జంతుక వెంకటయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజ్యాంగ ప్రాముఖ్యత, ప్రజాస్వామ్య విలువలు, పౌరుల హక్కులు, బాధ్యతలను గుర్తుచేసుకున్నారు.ఈ సందర్భంగా రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి ప్రాథమిక విలువలను కల్పిస్తుందని, కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన…

పరిష్కారం కోసం ఎదురుచూపులు.. పోలీసుల అరెస్టుల మధ్య కొనసాగుతున్న నిరసన

చారకొండ నవంబర్ 26: తమ భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతూ ఎర్రవల్లి భూ నిర్వాసితులు చేపట్టిన నిరసన దీక్షలు 360వ రోజుకు చేరుకున్నాయి.ఇంతకాలంగా శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తున్నప్పటికీ పోలీసులు హౌస్ అరెస్టులు చేయడం, నిరసన కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించడం పట్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తమకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాంతియుతంగానే నిరసనలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. అయినప్పటికీ పోలీసులు హౌస్ అరెస్టులు…

సీఎం సభకు భారీగా తరలిన వెల్దండ కాంగ్రెస్ శ్రేణులు

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి,నవంబర్ 26: అచ్చంపేటలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిర్వహించిన భారీ బహిరంగ సభకు వెల్దండ మండలంలోని వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లాయి. ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కార్యకర్తలు, అభిమానులు బస్సులు, ఇతర వాహనాల్లో సభకు బయలుదేరారు.ఈ సందర్భంగా సభకు బయలుదేరిన బస్సులను కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, వెల్దండ మండల పార్టీ అధ్యక్షులు హరి కిషన్ నాయక్,వెల్దండ సర్పంచ్…

సీఎం సభకు రాచూర్ నుంచి భారీగా తరలిన గ్రామస్థులు

సర్పంచ్ గున్నేళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళలు, గ్రామస్థుల ప్రయాణంవెల్దండ, నవంబర్ 26: అచ్చంపేటలో బుధవారం నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు వెల్దండ మండలం రాచూర్ గ్రామం నుంచి మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. గ్రామ సర్పంచ్ గున్నేళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి గ్రామస్థులు సభకు బయలుదేరారు.ఈ సందర్భంగా సర్పంచ్ గున్నేళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు…

అచ్చంపేటలో భూమిపూజకు వెల్దండ నుంచి భారీగా బయలుదేరిన గిరిజన శ్రేణులు

వెల్దండ,నవంబర్ 26:నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని పదర మండలం మద్దిమడుగులో గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించనున్న నేపథ్యంలో వెల్దండ మండల గిరిజన నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.మండలం నుంచి గిరిజన నాయకులు, సంఘాల ప్రతినిధులు బయలుదేరిన బస్సును వెల్దండ సింగిల్ విండో చైర్మన్ ఎన్నం భూపతిరెడ్డి, వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హరికిషన్ నాయక్ ఆధ్వర్యంలో…

ఆడబిడ్డ వివాహానికి సర్పంచ్ రూ.10 వేల ఆర్థిక సహాయం

వెల్దండ నవంబర్ 25 : వెల్దండ మండల పరిధిలోని రాచూర్ గ్రామానికి చెందిన కొవ్వూరి వినోద్ దంపతుల కుమార్తె వివాహం సందర్భంగా గ్రామ సర్పంచ్ గున్నేళ్ల శ్రీనివాస్ రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని బుధవారం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాస్కె గణేష్, గ్రామస్తులు గంగాధర్ రావు, నందు, సాగర్, యూసుఫ్, రమేష్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

చంద్రాయన్‌పల్లి వీరాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.4 లక్షల విరాళం

కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డిచారకొండ,నవంబర్ 24: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని చారకొండ మండలం చంద్రాయన్‌పల్లి గ్రామంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవ వేడుకల్లో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి కార్తీక దీపోత్సవంలో పాల్గొని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో,…