ప్రతి కుటుంబానికి బీమా భరోసా కల్పించడమే లక్ష్యం: సర్పంచ్ వెంకటయ్య
- ఆధార్ కార్డులో పేరు తప్పు.. సరిచేయాలని ఉద్యోగి విజ్ఞప్తి.! - November 23, 2026
- నిరుద్యోగుల ఆశలకు ఊపిరి.. సుంకిరెడ్డి జాబ్ డ్రైవ్ భరోసా.! - November 23, 2026
- ప్రతి కుటుంబానికి బీమా భరోసా కల్పించడమే లక్ష్యం: సర్పంచ్ వెంకటయ్య - November 23, 2026

ఆమనగల్లు,నవంబర్ 23 : ఆమనగల్లు మండలం పోలేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని గ్రామ సర్పంచ్ వెంకటయ్య ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి కుటుంబం బీమా పథకానికి తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందించాలనే ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సూచనల మేరకు గ్రామ ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బుచ్చిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ అంజన్ రెడ్డి, వార్డు సభ్యులు కృష్ణయ్య, అలివేలు, బాలకృష్ణయ్య, గండికోట జగన్, దేవేందర్, ఆసోజు భాస్కర్, వరికుప్పల అంజయ్య, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీకాంత్, మంజుల, యాదమ్మ, ఈదమ్మ, దశరథం, గుద్దేటి రవి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
