పేదల ప్లాట్లకు ముప్పు.. చెరువు భూముల కబ్జా? అక్రమాలపై తహసీల్దార్‌కు ఫిర్యాదు
- పేదల ప్లాట్లకు ముప్పు.. చెరువు భూముల కబ్జా? అక్రమాలపై తహసీల్దార్‌కు ఫిర్యాదు - November 28, 2026
- ఉర్దూ ఉపాధ్యాయుడు అబ్దుల్ ఖలిక్ పదవీ విరమణ.. ఘనంగా సన్మానించిన మున్సిపల్ చైర్ పర్సన్ - November 28, 2026
- కల్వకుర్తిలో ఘనంగా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి వేడుకలు - November 28, 2026
పేదల ప్లాట్లకు ముప్పు.. చెరువు భూముల కబ్జా? అక్రమాలపై తహసీల్దార్‌కు ఫిర్యాదు

వెల్దండ నవంబర్ 28: వెల్దండ మండల కేంద్రం శివారులోని 146 సర్వే నంబర్లో పేదల ప్లాట్ల హద్దులు తొలగించడంతో పాటు చెరువు భూమి, చెరువుకు వెళ్లే దారిని ఆక్రమించారని పురుషోత్తమాచారి ఆరోపించారు.ఈ మేరకు శనివారం తహసీల్దార్ కార్తీక్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.సర్వే నంబర్ 146లో గతంలో ఏర్పాటు చేసిన మక్కా కాలనీ లేఅవుట్లో పేదలు కొనుగోలు చేసిన ప్లాట్ల హద్దు రాళ్లను తొలగించి, భూములను ఆక్రమించారని బాధితులు ఆరోపించారు. అలాగే చెరువుకు వెళ్లే దారిని మూసివేసి, చెరువులో మట్టి పోసి పూడ్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల వర్షాకాలంలో గ్రామానికి ముంపు ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై ద్యాప జగత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని, 146 సర్వే నంబర్లో సమగ్ర సర్వే నిర్వహించి పేదలకు న్యాయం చేయడంతో పాటు చెరువు భూముల ఆక్రమణలను అడ్డుకోవాలని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ కొయ్యల పుల్లయ్య, బొక్కల శ్రీనివాస్ ముదిరాజ్, ఈదులపల్లి శ్రీనివాస్, అంజి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
