హద్దురాళ్ల తొలగింపు పై ప్లాట్ల కొనుగోలుదారుల ఆందోళన.. పునరుద్ధరిస్తామని నిర్వాహకుడి హామీ

హద్దురాళ్ల తొలగింపుపై ప్లాట్ల కొనుగోలుదారుల ఆందోళన

సర్పంచ్ చొరవతో స్పందన.. మూడు, నాలుగు రోజుల్లో పునరుద్ధరిస్తామని నిర్వాహకుడి హామీ

వెల్దండ: ప్లాట్ల హద్దురాళ్ల తొలగింపు వ్యవహారం బండోనిపల్లి గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ముందస్తు సమాచారం అందకపోవడంతో కొంతమంది ప్లాట్ల కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని సర్పంచ్ ఎనుముల సంగీత శేఖర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా,ఆమె స్పందించి సమాచారం అందించడంతో కొనుగోలుదారులు కృతజ్ఞతలు తెలిపారు.వెల్దండ మండల పరిధిలోని ఉమ్మడి బొల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న బండోనిపల్లి గ్రామంలో సర్వే నంబర్లు 297, 298, 299లో 2008లో అప్పటి గ్రామపంచాయతీ అనుమతితో ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో వెంచర్ ఏర్పాటు చేశారు. ఇటీవల వెంచర్‌లోని కొన్ని ప్లాట్ల హద్దురాళ్లు తొలగించడంతో కొనుగోలుదారులు సంబంధిత నిర్వహణాధికారి లతీఫ్ ఖాన్‌ను సంప్రదించారు.ఈ వ్యవహారంపై కొంతమంది కొనుగోలుదారులు వెల్దండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో లతీఫ్ ఖాన్ విలేకరులతో మాట్లాడుతూ,వెంచర్‌లో కొన్ని హద్దురాళ్లు దెబ్బతినడంతో వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు పాత హద్దురాళ్లను తొలగించినట్లు వివరించారు.కొంతమంది ప్లాట్ల యజమానులకు చరవాణి ద్వారా సమాచారం అందించామని,మరికొందరి ఫోన్ నంబర్లు అందుబాటులో లేకపోవడంతో అందరికీ సమాచారం చేరవేయలేకపోయామని తెలిపారు.తొలగించిన హద్దురాళ్లను మూడు, నాలుగు రోజుల్లో తిరిగి ఏర్పాటు చేయడంతోపాటు మొక్కలు నాటి ప్లాట్లను యజమానులకు అప్పగిస్తామని లతీఫ్ ఖాన్ హామీ ఇచ్చారు.ఇందుకు సంబంధించి ఒప్పంద పత్రం రాసి ఇవ్వడంతో కొనుగోలుదారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో కొనుగోలుదారులకు సమాచారం అందేలా స్పందించిన సర్పంచ్ ఎనుముల సంగీత శేఖర్ రెడ్డికి వారు అభినందనలు తెలిపారు.1001250978.jpg

1001250978.jpg

You may also like...