మృతుల కుటుంబాలకు దశరథ్ నాయక్ ఆర్థిక సాయం
- సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడవచ్చు..వెల్దండలో అవగాహన కార్యక్రమం - November 2, 2026
- మృతుల కుటుంబాలకు దశరథ్ నాయక్ ఆర్థిక సాయం - November 2, 2026
- డాన్స్ మాస్టర్ శేఖర్‌కు నాయకుల పరామర్శ.. రూ.10 వేల ఆర్థిక సాయం - November 2, 2026
వెల్దండ
అక్టోబర్ 31 : కడ్తాల్ మండలంలోని రెండు నిరుపేద మృతుల కుటుంబాలకు మాజీ జెడ్పీటీసీ, రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్ ఒక్కో కుటుంబానికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు.న్యామంతపూర్‌కు చెందిన ఓర్సు సరస్వతి ప్రమాదంలో మృతి చెందగా, రావిచేడు గ్రామానికి చెందిన అండే కార్ రామోజీ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న దశరథ్ నాయక్ బాధిత కుటుంబాలను పరామర్శించి,మృతదేహాలకు నివాళులర్పించారు.కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొప్పిడి గోపాల్,ప్రియ రమేష్,మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ రంగయ్య,వసంత, గ్రామ కమిటీ అధ్యక్షుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
