మొగులాన్‌పల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

మొగులాన్‌పల్లి శివారు అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న స్థావరంపై బాన్సువాడ పోలీసులు దాడి చేసి తొమ్మిది మందిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.18,630 నగదు, 8 సెల్‌ఫోన్లు, 4 మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

You may also like...