బాన్సువాడకు తెలంగాణ పబ్లిక్ స్కూల్

బాన్సువాడలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) భవన నిర్మాణానికి అధికారులు స్థల పరిశీలన చేపట్టారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు అధికారులు పర్యటించగా, పోచారం స్వయంగా స్థలాన్ని చూపించారు.టెన్ ప్లస్ టూ విద్యా విధానంలో భాగంగా ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే ప్రాంగణంలో విద్య అందించేందుకు ఈ పాఠశాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ హైస్కూల్, జూనియర్ కాలేజీని అనుసంధానం చేస్తూ నూతన భవన నిర్మాణానికి మంజూరు లభించింది.
ఈ కార్యక్రమంలో మాజీ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, ఎర్వల కృష్ణారెడ్డి, కౌన్సిలర్ మహమ్మద్ ఖాలేక్, కో-ఆప్షన్ సభ్యురాలు సుల్తానా గౌస్, ఈఈ రవీందర్, డీఈ సుబ్బారావు, నరహరి తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

You may also like...