తాడ్వాయి మండలంలో ఘనంగా దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్రలు

తాడ్వాయి: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం తాడ్వాయి మండలంలోని పలు గ్రామాల్లో దుర్గాదేవి నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకున్న అమ్మవారికి భక్తులు వైభవంగా శోభాయాత్ర నిర్వహించి వీడ్కోలు పలికారు. మండలంలోని ఎండ్రియాల్ గ్రామంలో తాడ్వాయి పీఏసీఎస్ చైర్మన్ సుధాకర్ రావు ఆటపాటలు, చిందులతో సందడి చేశారు. వివిధ గ్రామాల్లో డప్పుచప్పుళ్లు, భక్తుల జయజయధ్వానాలు, అమ్మవారి నామస్మరణల మధ్య శోభాయాత్రలు కొనసాగాయి. అలంకరించిన వాహనాలపై అమ్మవారి విగ్రహాలను ఉంచి గ్రామ ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. మహిళలు, యువకులు, చిన్నారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి భక్తిపూర్వకంగా వీడ్కోలు పలికారు.

You may also like...