తాడ్వాయి TRS మండల కమిటీలో ఇద్దరికి కీలక బాధ్యతలు

తాడ్వాయి: విజయదశమి పండుగ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ తాడ్వాయి మండల పార్టీ కమిటీలో ఇద్దరిని ఏకగ్రీవంగా నియమించారు. తాడ్వాయి మండల ప్రధాన కార్యదర్శిగా ఎండ్రియాల్ గ్రామానికి చెందిన గడ్డం రవీందర్‌ను, మండల ఉపాధ్యక్షుడిగా దేవాయిపల్లి గ్రామానికి చెందిన చెట్టి యాదగిరిని నియమించారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన గడ్డం రవీందర్, చెట్టి యాదగిరి పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలతో సమన్వయంగా పనిచేస్తూ తాడ్వాయి మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.

You may also like...