విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మోరీల్ శ్రీనివాసరావు, అంజిరెడ్డి
- అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఏడుపాయలలో భవాని మాత నిమజ్జనం - October 22, 2026
- మహాలింగాపురంలో వైభవంగా దుర్గామాత నిమజ్జనం - October 22, 2026
- చేవెళ్ల ఎమ్మెల్యే కు దసరా శుభాకాంక్షలు తెలిపిన శంకర్పల్లి కాంగ్రెస్ నాయకులు - October 22, 2026

- బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సూచన
జ్ఞాన తెలంగాణ, బాన్సువాడ ప్రతినిధి, అక్టోబర్ 21:
బాల్కొండ ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారిని బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త మోరీల్ శ్రీనివాసరావు, జిల్లా మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యకలాపాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సూచించినట్లు తెలిపారు.ప్రజలతో మమేకమై పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ బలోపేతమే లక్ష్యంగా సమష్టిగా ముందుకు సాగాలని నాయకులకు సూచించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చర్చించినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హన్మండ్లు, దత్తు, సంజీవులు, భాస్కర్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
