Category: జనగాం

గాంధీజీ జయంతి సందర్భంగా నివాళులు

దేవరుప్పుల: మండల తహశీల్దార్ కార్యాలయంలో గాంధీజీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి మండల గిర్దావర్ కాసర్ల రాజు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్, ఇన్‌చార్జి జీపీవోలు, జీపీవోలు, అంబాల శ్రీధర్, వెంకటేశ్, నరేందర్, కృష్ణ, యాకన్న, రమేష్, అజీముద్దీన్, రేణుక తదితరులు పాల్గొన్నారు.

నల్లా నర్సింహులు పోరాటం స్ఫూర్తిదాయకం: ఎర్రబెల్లి

పాలకుర్తి: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్లా నర్సింహులు పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శతజయంతి సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలోని నల్లా నర్సింహులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజా ఉద్యమ చరిత్రలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. సేవలు, త్యాగాలను స్మరించుకోవడం సామాజిక బాధ్యతగా పేర్కొన్నారు. యువతకు ఆయన పోరాట స్ఫూర్తి ఆదర్శంగా నిలవాలని అన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్…

నల్ల నరసింహులు సేవలు చిరస్మరణీయం

నల్ల నరసింహులు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన విగ్రహానికి సుందర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఏల సుందర్, నల్ల అరుణతో కలిసి నివాళులర్పించారు. పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నల్ల నరసింహులు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని, ఆయన త్యాగాలను స్మరించుకోవడం సామాజిక బాధ్యత అని ఏల సుందర్ అన్నారు. కార్యక్రమంలో జోగు సుదర్శన్, జోగు సుధాకర్, జోగు మధుసూదన్ పాల్గొన్నారు.

జనగామలో బహుజన వర్కర్స్ యూనియన్ ఎన్నికల మేనిఫెస్టో పోస్టర్ ఆవిష్కరణ

జనగామ ఆర్టీసీ బస్టాండ్ కేంద్రంగా బహుజన వర్కర్స్ యూనియన్ ఎన్నికల మేనిఫెస్టో పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర చైర్మన్ సీహెచ్ సంపత్ ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ సాజిద్, టీఆర్పీ జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ మాచర్ల బిక్షపతి, జిల్లా అధ్యక్షుడు కట్ల సదానందం ముదిరాజ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల హక్కుల పరిరక్షణ, శ్రమదోపిడీకి…

వడిచర్ల గ్రామానికి అభివృద్ధి నిధులు కేటాయించాలి ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కోరిన సర్పంచ్ చెరుకు కార్తీక్

వడిచర్ల గ్రామానికి అభివృద్ధి నిధులు కేటాయించాలి

ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కోరిన సర్పంచ్ చెరుకు కార్తీక్

SIRపై కాంగ్రెస్ నిరసన ర్యాలీ నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన

SIRపై కాంగ్రెస్ నిరసన ర్యాలీ
నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన

జనగామలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

జనగామ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, డీసీసీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి శ్రీనివాస్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.