శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం నూతన పాలకవర్గం ఎన్నిక
- ఓటర్ల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ ధర్నా ఓటు హక్కును హరిస్తే ఊరుకునేది లేదు - September 28, 2026
- SIRపై కాంగ్రెస్ నిరసన ర్యాలీ నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన - September 28, 2026
- జనగామలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ - September 28, 2026

జనగామలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం నూతన పాలకవర్గం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా రాముని శివుడు, ప్రధాన కార్యదర్శిగా గంగిశెట్టి మంజునాథ్, కోశాధికారిగా గట్టు రాధాకృష్ణ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా మిర్యాల రమేష్, తమ్మిశెట్టి మల్లికార్జున్ వ్యవహరించి ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు తమపై నమ్మకం ఉంచి ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. దేవస్థానం అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆధ్యాత్మిక కార్యక్రమాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు అందరి సహకారంతో కృషి చేస్తామని తెలిపారు. ఎన్నికలు విజయవంతంగా జరిగేందుకు సహకరించిన దేవస్థానం సభ్యులు, ఎన్నికల కమిటీ సభ్యులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
