జనగామలో ఘనంగా భగత్‌సింగ్ 119వ జయంతి వేడుకలు
- ఓటర్ల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ ధర్నా ఓటు హక్కును హరిస్తే ఊరుకునేది లేదు - September 28, 2026
- SIRపై కాంగ్రెస్ నిరసన ర్యాలీ నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన - September 28, 2026
- జనగామలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ - September 28, 2026

జనగామ పట్టణంలోని సంజయ్‌నగర్ భగత్‌సింగ్ చౌక్ వద్ద విప్లవ వీరుడు భగత్‌సింగ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాల వేసి, కొబ్బరికాయ కొట్టి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా జనగామ మున్సిపల్ 15వ వార్డు కౌన్సిలర్ మారబోయిన పాండు యాదవ్ పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం భగత్‌సింగ్ చేసిన త్యాగం, ఆశయాలు నేటి యువతకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని వక్తలు పేర్కొన్నారు. “విప్లవ వీరుడా.. నీ మరణం ఎన్ని జన్మలకైనా ఆశయ కిరణమే” అంటూ ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో భగత్‌సింగ్ యూత్ వ్యవస్థాపకుడు మంతెన మణికుమార్, యూత్ సభ్యులు, కాలనీవాసులు, వివిధ స్వచ్ఛంద యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
