Author: Venkateshwarlu Vardhamanu

నీళ్ల పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు: అనిల్ కుమార్

దేవరుప్పుల: బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు విమర్శలు మాని అభివృద్ధిపై మాట్లాడాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దావెరా అనిల్ కుమార్ అన్నారు. పాలకుర్తి రిజర్వాయర్ పనులు 70 శాతం పూర్తయ్యాయని, చెన్నూరు రిజర్వాయర్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఎస్సారెస్పీ కాలువల మరమ్మతులతో రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఐ భరత్ సుమన్

జనగామ జిల్లా: పాలకుర్తి పరిసర మండలాల ప్రజలకు సీఐ భరత్ సుమన్ ముందస్తు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఆయన హెచ్చరించారు.

పెద్దామడూర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

దేవరుప్పుల మండలం పెద్దామడూర్ గ్రామంలో ఏడో రోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు 100 డప్పులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దావెరా అనిల్, గ్రామ శాఖ అధ్యక్షుడు గనుపాక నరసయ్య, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ: ఎర్రబెల్లి

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి, కోలాటంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. కేసీఆర్ హయాంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చీరల పంపిణీలో జాప్యం చేస్తోందని విమర్శించారు. వేడుకల సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ…

సోమవారం ప్రజావాణి రద్దు

జనగామ: దసరా పండుగ నేపథ్యంలో ప్రభుత్వ సెలవు (OH) ఉన్నందున ఈ నెల 19వ తేదీ సోమవారం నిర్వహించాల్సిన జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసిన విషయాన్ని ప్రజలు గమనించాలని కలెక్టర్ సూచించారు. తమ వినతులు, ఫిర్యాదుల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌కు రావద్దని ఆయన కోరారు.

సద్దుల బతుకమ్మ వేళ విషాదం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురం గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి చిత్తలూరి మధు (అంజయ్య కుమారుడు) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గ్రామ సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ మృతదేహాన్ని సందర్శించి, బాధిత కుటుంబ సభ్యులను…

జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి

దేవరుప్పుల: జనగామ జిల్లా ఆవిర్భావానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌ వద్ద మాజీ సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసి వేడుకలు ఘనంగా నిర్వహించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్‌ పాలనలో జనగామ జిల్లా అభివృద్ధి చెందిందని, వైద్య కళాశాల, ఆసుపత్రులు, ఆలయాలు అభివృద్ధి చేశామని తెలిపారు. దేవాదుల నీటితో జిల్లా సస్యశ్యామలమైందన్నారు. ఆదివారం జరిగే వేడుకలకు మూడు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో…

అధికారుల నిర్లక్ష్యం.. ఏల సుందర్‌ సేవా దృక్పథం!

దేవరుప్పుల మండల కేంద్రంలోని హైలెవల్‌ వంతెనపై ప్రమాదకరంగా మారిన గుంతకు సుందర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ ఏల సుందర్‌ స్వచ్ఛందంగా మరమ్మతులు చేపట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి జేసీబీతో పగిలిన కాంక్రీట్‌ను తొలగించి, గుంతను చదును చేయించారు. అనంతరం కాంక్రీట్‌ పోయించి మరమ్మతులు చేయించారు. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తొలగాయి. ప్రజా సమస్య పరిష్కారానికి ముందుకొచ్చిన ఏల సుందర్‌కు గ్రామస్తులు, వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్‌ మండల నాయకులు,…

బ్రిడ్జిపై గుంత.. అధికారుల నిర్లక్ష్యం!

దేవరుప్పుల మండల కేంద్రంలోని వాగుపై ఉన్న మెయిన్‌ బ్రిడ్జి మొదటి భాగంలో ఏర్పడిన గుంత ప్రమాదకరంగా మారుతోంది. గుంత ఏర్పడి చాలా నెలలు గడుస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వాహనాలు, ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ మార్గంలో గుంత కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రజల భద్రత, ప్రయాణ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి బ్రిడ్జిపై ఉన్న గుంతను పూడ్చి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు…

గాంధీజీ జయంతి సందర్భంగా నివాళులు

దేవరుప్పుల: మండల తహశీల్దార్ కార్యాలయంలో గాంధీజీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి మండల గిర్దావర్ కాసర్ల రాజు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్, ఇన్‌చార్జి జీపీవోలు, జీపీవోలు, అంబాల శ్రీధర్, వెంకటేశ్, నరేందర్, కృష్ణ, యాకన్న, రమేష్, అజీముద్దీన్, రేణుక తదితరులు పాల్గొన్నారు.