జనగామలో బహుజన వర్కర్స్ యూనియన్ ఎన్నికల మేనిఫెస్టో పోస్టర్ ఆవిష్కరణ

జనగామ ఆర్టీసీ బస్టాండ్ కేంద్రంగా బహుజన వర్కర్స్ యూనియన్ ఎన్నికల మేనిఫెస్టో పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర చైర్మన్ సీహెచ్ సంపత్ ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ సాజిద్, టీఆర్పీ జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ మాచర్ల బిక్షపతి, జిల్లా అధ్యక్షుడు కట్ల సదానందం ముదిరాజ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల హక్కుల పరిరక్షణ, శ్రమదోపిడీకి వ్యతిరేకంగా యూనియన్ పోరాడుతుందని తెలిపారు. ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో ‘కత్తెర’ గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని కార్మికులను కోరారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయించేందుకు కృషి చేస్తామని, ఎన్నికల్లో గెలిచిన ఆరు నెలల్లోగా విలీనం జరగకపోతే తమ సంఘాన్ని రద్దు చేస్తానని తీన్మార్ మల్లన్న ప్రకటించారని వారు తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బహుజన వర్కర్స్ యూనియన్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు.కార్యక్రమంలో రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి రవికిరణ్, ఎన్.ధర్మారావు, సత్యనారాయణ, కుషాయిగూడ బస్ డిపో కార్యదర్శి ఎం.దుర్గేష్ గౌడ్, రాష్ట్ర కోశాధికారి కుమార్ కురుమ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అఫ్సర్, మైనారిటీ కార్యదర్శి అమ్జద్ పాషా, జిల్లా మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ హరీఫ్, టౌన్ మైనారిటీ యూత్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీమ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పానుగంటి నరసింగరావు, జిల్లా యువజన అధ్యక్షుడు యామంకి విజయ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...