వడిచర్ల గ్రామానికి అభివృద్ధి నిధులు కేటాయించాలి ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కోరిన సర్పంచ్ చెరుకు కార్తీక్
- వడిచర్ల గ్రామానికి అభివృద్ధి నిధులు కేటాయించాలి ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కోరిన సర్పంచ్ చెరుకు కార్తీక్ - September 29, 2026
- ఓటర్ల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ ధర్నా ఓటు హక్కును హరిస్తే ఊరుకునేది లేదు - September 28, 2026
- SIRపై కాంగ్రెస్ నిరసన ర్యాలీ నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన - September 28, 2026

లింగాలఘణపురం మండలంలోని వడిచర్ల గ్రామానికి అభివృద్ధి నిధులు కేటాయించాలని సర్పంచ్ చెరుకు కార్తీక్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కోరారు. మండలంలోని కొత్తపల్లి, వనపర్తి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యేను సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సమస్యలపై వివరించారు. వడిచర్ల గ్రామానికి అవసరమైన అభివృద్ధి నిధులు ఎందుకు మంజూరు కావడం లేదో తెలియడం లేదని తెలిపారు. గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. గ్రామంలో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సర్పంచ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
