నల్లా నర్సింహులు పోరాటం స్ఫూర్తిదాయకం: ఎర్రబెల్లి

IMG_1559.jpeg

పాలకుర్తి: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్లా నర్సింహులు పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శతజయంతి సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలోని నల్లా నర్సింహులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజా ఉద్యమ చరిత్రలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. సేవలు, త్యాగాలను స్మరించుకోవడం సామాజిక బాధ్యతగా పేర్కొన్నారు. యువతకు ఆయన పోరాట స్ఫూర్తి ఆదర్శంగా నిలవాలని అన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ కుమార్, నాయకులు, యువజన నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like...