Category: తెలంగాణ

గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొన్న సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్

గణేశ్ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ వెల్దండ: మండల కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద సర్పంచ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల విజ్ఞప్తి మేరకు శ్రీ సీతారామస్వామి దేవాలయ నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.అనంతరం శ్రీ సాయినగర్ కాలనీలో నిర్వహించిన అన్నప్రసాద వితరణలో పాల్గొన్నారు. శ్రీరామ గణేశ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, ఆటపాటల కార్యక్రమాల్లో పాల్గొని, సన్మానం…

22ఏ ఆస్తులకు రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్‌:తెలంగాణలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ వంటి చట్టబద్ధమైన ప్రణాళికా సంస్థల నుంచి అనుమతులు పొందిన లేఅవుట్లు, ప్లాట్లు, భవనాలకు రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం...

ఆదిలాబాద్‌ జిల్లా స్వేరోస్‌ నూతన కమిటీ ఎన్నిక

జ్ఞాన తెలంగాణ,ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాకు స్వేరోస్‌ పూర్తి స్థాయి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్వేరోస్‌ రాష్ట్ర కమిటీ సూచనల మేరకు జిల్లా అధ్యక్షురాలిగా అంజలి స్వేరో, జిల్లా ప్రధాన కార్యదర్శిగా స్రవంతి స్వేరో ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షురాలిగా తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఆదిలాబాద్‌...

తలకొండపల్లి బీజేపీ మండల అధ్యక్షుడిగా నీలకంఠ పాండు

తలకొండపల్లి మండల బీజేపీ అధ్యక్షుడిగా నీలకంఠ పాండు నియమితులయ్యారు. జాతీయ నేత తల్లోజు ఆచారి ఆశీర్వాదం తీసుకుని బాధ్యతలు స్వీకరించారు. తనకు అవకాశం ఇచ్చిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన, మండలంలో పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా మార్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు

అచ్చంపేటలో గుడిసెల్లో నివసిస్తున్న ప్రతి పేద కుటుంబానికి తొలి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ అన్నారు. క్యాంప్ ఆఫీస్ లో లబ్ధిదారులతో సమావేశమయ్యారు.2వ విడతలో 2.5 లక్షల ఇళ్లు గుడిసె వాసులకే కేటాయిస్తామని, అర్హుల గుర్తింపు కోసం AI తో సమగ్ర సర్వే చేస్తున్నామని తెలిపారు.

అచ్చంపేటలో కాంగ్రెస్ సమీక్ష సమావేశం

అచ్చంపేట నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, పట్టణ అధ్యక్షులతో డా. వంశీకృష్ణ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..• గ్రామాల్లో ప్రజా సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలి. • ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. • పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. • పార్టీ కోసం…

అన్నదానంతో సమాజ తృప్తి: ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

అన్నదానంతో సమాజ తృప్తి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిజ్ఞాన తెలంగాణ,షాద్ నగర్ ప్రతినిధి సెప్టెంబర్ 24:ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత ఆత్మశుద్ధి ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అనిత రఘునాథ యాదవ్,ప్యాట అశోక్,మాజీ కౌన్సిలర్లు కానుక అనంతయ్య,రేటికల్ ప్రతాప్ రెడ్డి కౌన్సిలర్స్ నక్కల వెంకటేష్ గౌడ్,సలీం,మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి,నాయకులు శేరి శ్రీనివాస్ రెడ్డి,అల్లాడ శేఖర్,దినేష్ సాగర్,నడికూడ సంతోష్ యాదవ్,అల్లాడ శేఖర్,అషు భూమ్,అన్వారీ రాజు తదితరులు పాల్గొన్నారు.

వైద్యం కోసం వస్తే భయం వెంటాడుతోంది..

వైద్యం కోసం వస్తే భయం వెంటాడుతోంది.. చెత్తాచెదారం, పిచ్చిమొక్కలతో కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలు.కట్టంగూర్, సెప్టెంబర్ 24 : అనారోగ్యంలో వస్తే వైద్యం అందాల్సిన అసుపత్రి పరిసరాలు మాత్రం భయానక వాతావరణ కనిపిస్తోంది. కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో పచ్చని చెట్లు ఉన్నా వాటి చుట్టూ చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు పేరుకుపోవడంతో పాములు, దోమలు, విషకీటకాలకు ఆవాసంగా మారింది..మండలంలోని వివిధ గ్రామాల నుంచి అనారోగ్య సమస్యలతో పరువురు అసుపత్రికి వస్తుంటారు. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు వచ్చినప్పుడు…