ఆదిలాబాద్‌ జిల్లా స్వేరోస్‌ నూతన కమిటీ ఎన్నిక

  • జిల్లా అధ్యక్షురాలిగా అంజలి స్వేరో ఏకగ్రీవ ఎన్నిక
  • ప్రధాన కార్యదర్శిగా స్రవంతి స్వేరో ఎంపిక
  • రాష్ట్ర కమిటీ సూచన మేరకు నూతన బాధ్యతలు
  • స్వేరోస్‌ నెట్‌వర్క్‌ విస్తరణకు కృషి

జ్ఞాన తెలంగాణ,ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాకు స్వేరోస్‌ పూర్తి స్థాయి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్వేరోస్‌ రాష్ట్ర కమిటీ సూచనల మేరకు జిల్లా అధ్యక్షురాలిగా అంజలి స్వేరో, జిల్లా ప్రధాన కార్యదర్శిగా స్రవంతి స్వేరో ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షురాలిగా తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఆదిలాబాద్‌ జిల్లా స్వేరోస్‌ ఇన్‌చార్జ్‌ పెంటపర్తి ఆశన్న స్వేరోస్‌, రాష్ట్ర అధ్యక్షులు చిలక బత్తిని వీరన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరమల్ల ప్రకాష్‌కు అంజలి స్వేరో కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో స్వేరోస్‌ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేస్తామని ఆమె పేర్కొన్నారు. సంస్థ ఆశయాలు, ప్రవీణ్‌ సార్‌ ఆలోచనా విధానాలను గ్రామగ్రామానికీ తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. విద్య, సామాజిక చైతన్యం, సమాజాభివృద్ధి లక్ష్యాలతో కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ జిల్లాలో స్వేరోస్‌ కార్యకలాపాలను విస్తృతం చేయనున్నట్లు వెల్లడించారు. నూతన కమిటీ ఎన్నికతో జిల్లా స్వేరోస్‌ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.

You may also like...