పట్టభద్రుల ఓటు నమోదు చేసుకున్న వడ్త్యావత్ రాజు నాయక్

1001307401.jpg

,అక్టోబర్ 28 :అర్హులైన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటు నమోదు చేసుకోవాలని వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామ మాజీ ఉప సర్పంచ్, ఉప సర్పంచ్ల సంఘం మండల మాజీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు వడ్త్యావత్ రాజు నాయక్ పిలుపునిచ్చారు.బుధవారం ఆయన ఉమ్మడి మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటు నమోదు కోసం వెల్దండ తహసీల్దార్ కార్తీక్ కుమార్ ను కలిసి తన దరఖాస్తు పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వడ్త్యావత్ రాజు నాయక్ మాట్లాడుతూ..పట్టభద్రుల ఓటు అనేది కేవలం ఓటు మాత్రమే కాదు, విద్యావంతుల గొంతుక.మన సమస్యలను శాసనమండలిలో వినిపించే ప్రతినిధిని ఎన్నుకునే గొప్ప అవకాశం. డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు దాటిన ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా తమ ఓటును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

You may also like...