నీటిని పొదుపుగా వాడుకోవాలి : మునుకుంట్ల సర్పంచ్ గుల్లి నరేష్
- నీటిని పొదుపుగా వాడుకోవాలి : మునుకుంట్ల సర్పంచ్ గుల్లి నరేష్ - October 28, 2026
- టీఎస్‌యూటీఎఫ్ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి : మిట్టపల్లి మురళయ్య - October 28, 2026
- కట్టంగూర్ ను కరువు మండలంగా ప్రకటించాలి.. - October 28, 2026
నీటిని పొదుపుగా వాడుకోవాలి : మునుకుంట్ల సర్పంచ్ గుల్లి నరేష్
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 28 : నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని మండలంలోని మునుకుంట్ల సర్పంచ్ గుల్లి నరేష్ సూచించారు. జలమీషన్, మిషన్ జల మహోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం గ్రామంలో అధికారులు, పాలకవర్గ సభ్యులు, కళాకారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు నీటి పొదుపు ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరు విలువైన వనరని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి అవసరమైన మేరకే వినియోగించుకోవాలని సూచించారు. నీటిని వథా చేయకుండా భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కడారి మల్లేష్,
వార్డు సభ్యులు పందుల లక్ష్మి, ముడుసు నర్మద, పల్లపు కృష్ణ, పంచాయతీ కార్యదర్శి ముషం భవాని, కళాకారులు వీర ప్రతాప్ నాగిళ్ళ కొండల్ ప్రియాంక, ఇందిరా, ప్రియదర్శిని, తేజ తాటిపాముల శంకర్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, .
