టీఎస్‌యూటీఎఫ్ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి : మిట్టపల్లి మురళయ్య
- నీటిని పొదుపుగా వాడుకోవాలి : మునుకుంట్ల సర్పంచ్ గుల్లి నరేష్ - October 28, 2026
- టీఎస్‌యూటీఎఫ్ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి : మిట్టపల్లి మురళయ్య - October 28, 2026
- కట్టంగూర్ ను కరువు మండలంగా ప్రకటించాలి.. - October 28, 2026
టీఎస్‌యూటీఎఫ్ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి : మిట్టపల్లి మురళయ్య
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్: అక్టోబర్ 28: నవంబర్ 1, 2 తేదీల్లో కట్టంగూర్ లో నిర్వహించనున్న టీఎస్‌యూటీఎఫ్ 7వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ మిట్టపల్లి మురళయ్య కోరారు. బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహాసభల పోస్టర్‌ను ఎంఈఓ ఎం. శ్రీలత, ప్రధానోపాధ్యాయులు ఏ. అంజయ్య, కే. భద్రినారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మురళయ్య మాట్లాడుతూ.. మహాసభల్లో టీఎల్‌ఎం మేళా, రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎంపీ శ్యామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రొఫెసర్ కే. నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తదితరులు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ మండల అధ్యక్షుడు పుట్ట రాములు, ప్రధాన కార్యదర్శి దేశపాక కృష్ణ, నాయకులు నామా వెంకటేశ్వర్లు, పోశం సైదులు, రాజశేఖర్‌రెడ్డి, మీనయ్య, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
