వైద్యం కోసం వస్తే భయం వెంటాడుతోంది..
- వైద్యం కోసం వస్తే భయం వెంటాడుతోంది.. - September 24, 2026
- అంబటి వాగులో ప్రభుత్వ భూమిని పరిశీలించిన అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి - September 24, 2026
- కట్టంగూర్ లో ఘనంగా వినాయక నిమజ్జనం భక్తిశ్రద్ధలతో శోభాయాత్రలు.. - September 24, 2026
వైద్యం కోసం వస్తే భయం వెంటాడుతోంది..
చెత్తాచెదారం, పిచ్చిమొక్కలతో కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలు.
కట్టంగూర్, సెప్టెంబర్ 24 : అనారోగ్యంలో వస్తే వైద్యం అందాల్సిన అసుపత్రి పరిసరాలు మాత్రం భయానక వాతావరణ కనిపిస్తోంది. కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో పచ్చని చెట్లు ఉన్నా వాటి చుట్టూ చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు పేరుకుపోవడంతో పాములు, దోమలు, విషకీటకాలకు ఆవాసంగా మారింది..
మండలంలోని వివిధ గ్రామాల నుంచి అనారోగ్య సమస్యలతో పరువురు అసుపత్రికి వస్తుంటారు. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు వచ్చినప్పుడు పరిసరాల్లో విషసర్పాలు సంచరిస్తుండడంతో భయాందోళనకు గురవుతున్నారు. వైద్యం కోసం వచ్చిన వారు కాసేపు చెట్ల కింద కూర్చోవాలన్నా పరిసరాల పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. అసుపత్రి పరిసరాల పరిస్థితి ఆధ్వానంగా మారిన సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత వైద్య, పంచాయతీ అధికారులు స్పందించి ఆరోగ్య కేంద్రం పరిసరాల్లో ఉన్న చెత్తాచెదారం, పిచ్చిమొక్కలను తొలగించి దోమలు, విషసర్పాల నివారణకు చర్యలు తీసుకోవాలని అనుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలు కోరుతున్నారు.
ఏళ్లుగా నిరుపయోగంగా విశ్రాంతి గది..
ఆసుపత్రి ప్రాంగణంలో వైదాధికారి విశ్రాంతి గది గత కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉంది. సరైన నిర్వహణ, మరమ్మతులు లేకపోవడంతో భవనం చుట్టూ పిచ్చి మొక్కలు పెరగడంతో పాటు శిథిలావర్ధకు చేరింది. విశ్రాంతి గదికి మరమ్మతులు చేపట్టి తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చి ఇతర అవసరల కోసం వినియోగించుకోవాలని పరువురు కోరుతున్నారు.
ఆసుపత్రి పరిసరాలపై పర్యవేక్షణ కరువు..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వెనుక భాగంలో నూతన భవనం నిర్మించారు. పాత భవనంలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని కొత్త భవనంలోని తరలించారు. దీంతో పాత భవనం చుట్టూ చెత్తాచెదారం, పిచ్చి మొక్కలే దర్శనమిస్తున్నాయి. ఆరోగ్య కేంద్రం పరిసరాలు ఆధ్వానంగా మారండంతో విషసర్పాలకు ఆవాసం మారింది. పరిసరాలపై పర్యవేక్షణ లేకపోవడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఈ దుస్థితికి చేరిందని రోగులు ఆరోపిస్తున్నారు.

