మైసూరు దసరా వేడుకలకు బయలుదేరిన సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి మైసూరు పర్యటనకు బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన మైసూరుకు ప్రయాణమయ్యారు. మైసూరులో నిర్వహించే దసరా వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందిన మైసూరు దసరా ఉత్సవాలు సంప్రదాయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వైభవమైన వేడుకలకు...
