కల్వకుర్తిలో రావణ దహన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి – ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

దసరా పండుగ వేడుకల్లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.తన స్వగ్రామం నుంచి తిరిగి హైదరాబాద్ వస్తున్న సమయంలో ముఖ్యమంత్రి గారు కల్వకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో జరుగుతున్న దసరా వేడుకలకు హాజరయ్యారు. వేదికపైకి వచ్చిన సీఎం గారికి స్థానిక ప్రజాప్రతినిధులు శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకే విజయదశమి అని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.1001378568.jpg

ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి గారు, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నా

రు.

You may also like...