లింగారెడ్డిపల్లి గ్రామంలో ఆడపడుచుల బతుకమ్మలతో దసరా సంబురాలు

వెల్దండ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ ఆడపడుచులు బతుకమ్మలతో ఆడిపాడి, అనంతరం జమ్మిచెట్టు వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు.1001378637.jpg

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహ్మద్ అన్వర్ పాషా, ఉప సర్పంచ్ జోగు రాములమ్మ లింగమయ్య, గ్రామ పెద్దలు రాఘవ రెడ్డి, నేతలు కుపిరెడ్డి అశోక్ రెడ్డి, మైల అల్వాల్ రెడ్డి, మైల హనుమంత్ రెడ్డి, మైల సుధాకర్ రెడ్డి, మల్లేపాకుల శేఖర్, పబ్బు శ్రీకాంత్, వార్డు సభ్యులు వట్టేపు అల్లాజి, ఆకినమోని మల్లేష్, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఇలాంటి పండుగలు జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. జమ్మి చెట్టు వద్ద ఒకరికొకరు జమ్మి ఆకులు ఇచ్చుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

You may also like...