ఘట్‌కేసర్‌ ఫామ్‌హౌస్‌లో బీటెక్‌ విద్యార్థి అనుమానాస్పద మృతి

జ్ఞాన తెలంగాణ,వెబ్ డెస్క్,మేడ్చల్‌:

మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఏదులాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన 21 ఏళ్ల బీటెక్‌ విద్యార్థి కృష్ణ కౌండిన్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉప్పల్‌ భగాయత్‌కు చెందిన రిటైర్డ్‌ ఎస్‌ఐ ప్రవీణ్‌ కుమార్‌ కుమారుడైన కృష్ణ కౌండిన్య మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే, యువకుడి మరణంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై స్పష్టత రావాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫామ్‌హౌస్‌లో జరిగిన వేడుకల వివరాలు, యువకుడి మృతికి గల కారణాలు, ఇతర పరిస్థితులపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. దర్యాప్తు పూర్తయితేనే ఘటన వెనుక ఉన్న వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

You may also like...