ప్రతి ఒక్కరిలో ధైవ భక్తి కలిగి ఉండాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
- ప్రతి ఒక్కరిలో ధైవ భక్తి కలిగి ఉండాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య - October 21, 2026
- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి : మునుకుంట్ల సర్పంచ్ గుల్లి నరేష్ - October 19, 2026
- పోలీసు దుస్తుల వెనుక ఒక బాధ్యతగల అధికారి ఉంటారు… - October 19, 2026
ప్రతి ఒక్కరిలో ధైవ భక్తి కలిగి ఉండాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 19 : ప్రతి ఒక్క రిలో దైవ భక్తి ఉలిగి ఉండాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఈదులూరు, చెర్వుఅన్నారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద సోమవారం ఆయన ప్రత్యేక పూజాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గామాత కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబ సంతోషంగా ఉండాలని పేర్కొన్నారు. అమ్మవారి ఆరాధన ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడం వల్ల మనసుకు ప్రశాంతత కలిస్తుందన్నారు. దైవభక్తితో పాటు సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, మాజీ ఎంపీటీసీ గుండగోని రాములు, నాయకులు కక్కిరేణి నవీన్ గౌడ్, పోగుల నర్సింహ్మ, పాడిచేటి సైదులు, బోడ యాదగిరి, వనని సైదులు, బీరెల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
