ఆలయాల నిర్మాణానికి గోలి బుచ్చిరెడ్డి కుటుంబం రూ.1.11 లక్షల విరాళం
- శరన్నవరాత్రి ఉత్సవాలకు సుంకిరెడ్డి రూ.80 వేల విరాళం - October 21, 2026
- యమపాశమైన ఈవీ చార్జర్.. యువకుడు బలి - October 21, 2026
- ఆలయాల నిర్మాణానికి గోలి బుచ్చిరెడ్డి కుటుంబం రూ.1.11 లక్షల విరాళం - October 21, 2026

వెల్దండ,అక్టోబర్ 21: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చెరుకూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయం,ఆంజనేయస్వామి దేవాలయాల నిర్మాణానికి గోలి బుచ్చిరెడ్డి కుటుంబ సభ్యులు రూ.1,11,111 విరాళంగా అందజేశారు.బుచ్చిరెడ్డి కుమారులు గోలి శ్రీనివాస్ రెడ్డి, గోలి శ్రీకాంత్ రెడ్డి, మనుమడు గోలి శివానందన్ రెడ్డిలు బుధవారం ఈ విరాళాన్ని అందించారు.వారి దాతృత్వానికి ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆ భగవంతుడు వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు,ఉపసర్పంచ్ కొండలు,ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు గోవర్ధన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, సందీప్, చంద్రారెడ్డి, మహేష్, మధుసూదన్ రెడ్డి,బుజ్జిరెడ్డి, ప్రవీణ్, కొండల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, సత్యం, వెంకటయ్య, బాలయ్య, జంగయ్య, సుభాష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
