Category: జిల్లా వార్తలు

విద్యుత్‌ మృత్యుపాశం.. మహిళా రైతు బలి!

జ్ఞాన తెలంగాణ, వరంగల్‌: వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన మహిళా రైతు విద్యుత్‌ మృత్యుపాశానికి బలైంది. వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం గుడితండాలో విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతి చెందిన విషాద ఘటన కలచివేస్తోంది. రెక్కలు ముక్కలు చేసుకుని పంటలు సాగు చేస్తూ కుటుంబానికి అండగా...

దేవస్థానానికి వెళ్లొస్తే.. ఇంట్లో బంగారం, నగదు మాయం!

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌: ఇంటికి తాళం వేసి దేవస్థానానికి వెళ్లిన కుటుంబానికి తిరిగి వచ్చేసరికి చేదు అనుభవం ఎదురైంది. ఇంట్లో దాచుకున్న విలువైన బంగారు ఆభరణాలు, నగదు కనిపించకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. హైదరాబాద్‌ నగరంలోని ఉప్పల్‌ పరిధి భరత్‌నగర్‌లో ఈ చోరీ ఘటన చోటుచేసుకుంది. బాధితులు కొమరవెల్లి...

డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యం..

కామారెడ్డి జిల్లా యువతలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు, డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు కామారెడ్డి నియోజకవర్గం భిక్నూర్ మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ గారి సైకిల్‌ యాత్రను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని యువతకు పిలుపునిస్తున్నారు.

నేడు కామారెడ్డి జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన

తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క మంగళవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రామారెడ్డి, సదాశివనగర్, బాన్సువాడ మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పోసానిపేటలో మహిళా సంఘం భవనాన్ని ప్రారంభించనుండగా, గిద్దె, కుప్రియాల్ గ్రామాల్లో సబ్‌స్టేషన్ల స్థలాలను పరిశీలిస్తారు. బాన్సువాడ మండలం కొయగూట్ట తండాలో గ్రామపంచాయతీ, మహిళా సంఘాల భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. కొయగూట్టలో మహిళా మండలి భవనాన్ని ప్రారంభించి, బోర్లంలో నూతన సబ్‌స్టేషన్‌ను…

శంకర్‌పల్లిలో గంజాయి కలకలం..

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: శంకర్‌పల్లి ప్రాంతంలో గంజాయి వ్యవహారం కలకలం రేపింది. ఎస్‌ఓటీ పోలీసులు చేపట్టిన దాడిలో 170 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో శంకర్‌పల్లికి చెందిన వ్యక్తి ఒకరు, లింగంపల్లికి చెందిన మరొకరు వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది. బీదర్‌కు చెందిన మరో...

రేపు బాన్సువాడకు మంత్రి సీతక్క

బాన్సువాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి సీతక్క అక్టోబర్ 27న పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొయ్యగుట్ట తండాలో గ్రామ పంచాయతీ, మహిళా సమాఖ్య భవనాలకు భూమిపూజ, 3 గంటలకు బాన్సువాడ 3వ వార్డులో మహిళా సమాఖ్య భవనం ప్రారంభోత్సవం, 3.30 గంటలకు బోర్లం శివారులో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. పర్యటన ఏర్పాట్లపై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రజాప్రతినిధులు, నాయకులతో సమీక్ష నిర్వహించి కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.

ATM Theft Case |అంతర్రాష్ట్ర ఏటీఎం చోరీ ముఠా గుట్టురట్టు

అంతర్రాష్ట్ర ఏటీఎం చోరీ ముఠా గుట్టురట్టు రాజస్థాన్ లో ప్రధాన నిందితుడి అరెస్ట్గాం ధారి ఎస్బీఐ ఏటీఎంలో రూ. 25.45 లక్షల చోరీ – 5 రాష్ట్రాలు దాటి సాగిన కామారెడ్డి పోలీసుల గాలింపు నగదు, స్కార్పియో వాహనం, గ్యాస్ కట్టర్ పరికరాలు స్వాధీనం కామారెడ్డి, అక్టోబర్ 26: గాంధారి మండలంలో సంచలనం సృష్టించిన ఎస్బీఐ ఏటీఎం చోరీ కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ప్రధాన నిందితుడిని రాజస్థాన్ లో పట్టుకున్నట్లు జిల్లా…

టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి : కావలి యాదయ్య

టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి : కావలి యాదయ్యజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 26: కొత్తగూడెంలో ఈ నెల 31న నిర్వహించనున్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) 17వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని టీపీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కావలి యాదయ్య కోరారు. సోమవారం కట్టంగూర్ లో ఆవిర్భావ సభ కరపత్రాలను మండల అధ్యక్షుడు రాపోలు పవన్‌కుమార్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నా ప్రజల ఆకాంక్షలు పూర్తిస్థాయిలో నెరవేరలేదన్నారు….

ఉద్యమకారుల ముందస్తు అరెస్టు

ఉద్యమకారుల ముందస్తు అరెస్టుజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 26 : సమస్యలు పరిష్కరించాలని ఉద్యమకారులు సోమవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కట్టంగూర్ పోలీసులు మండలంలోని పలు గ్రామానికి చెందిన ఉద్యమకారులను ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకతుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం చేపట్టే ఉద్యమాలను ముందుస్తు అరెస్టులతో అడ్డుకోలేరని పేర్కొన్నారు. అరెస్టు అయిన వారిలో గద్దపాటి…

కల్వకుర్తిలో పట్టభద్రుల ఓటు నమోదు అవగాహన కార్యక్రమం

కల్వకుర్తి:మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ నమోదులో భాగంగా కల్వకుర్తి పట్టణంలో ఈరోజు పట్టభద్రుల ఓటు నమోదు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.కల్వకుర్తి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట RSP ఫౌండేషన్ మరియు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఓటుగా నమోదు చేసుకోవాలని, పట్టభద్రుల ఓటు ప్రాధాన్యతను వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బావండ్ల మధు, కార్మిక సంఘం అధ్యక్షులు…