ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
- టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి : కావలి యాదయ్య - October 26, 2026
- ఉద్యమకారుల ముందస్తు అరెస్టు - October 26, 2026
- ఆధునిక సాంకేతికతతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి : వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్రమోహన్ - October 25, 2026
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 26 : సమస్యలు పరిష్కరించాలని ఉద్యమకారులు సోమవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కట్టంగూర్ పోలీసులు మండలంలోని పలు గ్రామానికి చెందిన ఉద్యమకారులను ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకతుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం చేపట్టే ఉద్యమాలను ముందుస్తు అరెస్టులతో అడ్డుకోలేరని పేర్కొన్నారు. అరెస్టు అయిన వారిలో గద్దపాటి దానయ్య, రేకల బిక్షం, గాదగోని వెంకన్న, పాదూరి శిశుపాల్ రెడ్డి, కోమటి భాస్కర్ ఉన్నారు.
