ATM Theft Case |అంతర్రాష్ట్ర ఏటీఎం చోరీ ముఠా గుట్టురట్టు

అంతర్రాష్ట్ర ఏటీఎం చోరీ ముఠా గుట్టురట్టు రాజస్థాన్ లో ప్రధాన నిందితుడి అరెస్ట్గాం ధారి ఎస్బీఐ ఏటీఎంలో రూ. 25.45 లక్షల చోరీ – 5 రాష్ట్రాలు దాటి సాగిన కామారెడ్డి పోలీసుల గాలింపు నగదు, స్కార్పియో వాహనం, గ్యాస్ కట్టర్ పరికరాలు స్వాధీనం కామారెడ్డి, అక్టోబర్ 26: గాంధారి మండలంలో సంచలనం సృష్టించిన ఎస్బీఐ ఏటీఎం చోరీ కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ప్రధాన నిందితుడిని రాజస్థాన్ లో పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర వెల్లడించారు. అక్టోబర్ 10-11 అర్ధరాత్రి గాంధారి ప్రధాన రహదారిలోని SBI ATM లో గుర్తుతెలియని వ్యక్తులు నైటీలు, మాస్కులు ధరించి, CCTV లపై నల్ల స్ప్రే కొట్టి, గ్యాస్ కట్టర్ తో యంత్రాన్ని ధ్వంసం చేసి రూ.25,45,900 నగదు ఉన్న 5 బాక్సులను ఎత్తుకెళ్లారు. గాంధారి పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నం220/2026 గా కేసు నమోదైంది. కేసు తీవ్రత దృష్ట్యా ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీఎస్ ఇన్ స్పెక్టర్ సంతోష్ కుమార్, ఎస్సైలు ఆంజనేయులు, పుష్పరాజ్ తదితరులు CCTV ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితులు నల్ల స్కార్పియో వాహనంలో వచ్చి, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు MH, TS, HR నకిలీ నంబర్ ప్లేట్లు మారుస్తూ తిరిగినట్లు తేలింది. గాంధారి వచ్చే దారిలో ఒక వెల్డింగ్ షాప్ తాళం పగలగొట్టి ఆక్సిజన్ సిలిండర్ దొంగిలించి నేరానికి ఉపయోగించారు. సెప్టెంబర్ లో కరీంనగర్ లో రెండు ATM లలో కూడా ఇదే ముఠా చోరీ చేసినట్లు గుర్తించారు. చోరీ అనంతరం మహారాష్ట్ర, రాజస్థాన్ వైపు పారిపోతుండగా రాజస్థాన్ చేచాట్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా టైరు పంక్చర్ కావడంతో వాహనం వదిలి నగదుతో పరారయ్యారు. రాజస్థాన్ చేరుకున్న కామారెడ్డి ప్రత్యేక బృందాలు అక్టోబర్ 20న బరోడా మేవ్ సమీపంలో భరత్ పూర్ రోడ్డుపై ఉన్న ప్రధాన నిందితుడు రషీద్ (30), తండ్రి హలాం, రాజస్థాన్ ను అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్ పై కామారెడ్డి తీసుకొచ్చారు. 21న చేచాట్ లో వదిలేసిన స్కార్పియో వాహనంతో పాటు గ్యాస్ కట్టర్ పరికరాలు, కత్తులు, నకిలీ నంబర్ ప్లేట్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్నవి: రూ.29,400 నగదు, స్కార్పియో వాహనం, 2 మొబైల్ ఫోన్లు, గ్యాస్ కట్టర్, ఆక్సిజన్ సిలిండర్ పరికరాలు, 6 నకిలీ నంబర్ ప్లేట్లు, మాస్కులు, 3 కత్తులు. నిందితుడిని నేడు కోర్టులో హాజరుపరచనున్నట్లు, పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Dubbaka Srinivas

My name is DUBBAKA SRINIVAS, Education:(B.A), GRADUATED, I have multiple skills but I'm interested journalism My was facing the more than problems in society but I stand with GENUINE & TRUE peoples and society I will try to Justies, I will show the truth to society.

You may also like...