రేపు బాన్సువాడకు మంత్రి సీతక్క

బాన్సువాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి సీతక్క అక్టోబర్ 27న పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొయ్యగుట్ట తండాలో గ్రామ పంచాయతీ, మహిళా సమాఖ్య భవనాలకు భూమిపూజ, 3 గంటలకు బాన్సువాడ 3వ వార్డులో మహిళా సమాఖ్య భవనం ప్రారంభోత్సవం, 3.30 గంటలకు బోర్లం శివారులో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. పర్యటన ఏర్పాట్లపై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రజాప్రతినిధులు, నాయకులతో సమీక్ష నిర్వహించి కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.

You may also like...