Category: జిల్లా వార్తలు

మహిళలపై వేధింపులు.. 206 మందికి పోలీసుల షాక్!

ప్రత్యేక కథనం: మహిళల భద్రతపై ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కొందరి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. మహిళలను వేధించడం, వెంటపడటం, ఫోన్ కాల్స్‌తో విసిగించడం, సోషల్ మీడియా వేదికగా అసభ్య సందేశాలు పంపడం, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడటం...

ఉద్యమ వీరవనిత ధ్యాప విజితకు జన్మదిన శుభాకాంక్షలు.!

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర.. ప్రజాసేవలో ప్రయాణం కల్వకుర్తి, నవంబర్ 14: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ తొలి దశ నుంచే పోరాట బాటలో పయనిస్తూ, ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమకారిణి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, వెల్దండ మండల మాజీ జెడ్పీటీసీ ధ్యాప విజితకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ వెనకడుగు వేయకుండా ప్రజల పక్షాన నిలిచిన నాయకురాలిగా ఆమె గుర్తింపు పొందారు….

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఈ నెల 19న ముఖ్యమంత్రి చేతుల మీదుగా పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన కుటుంబంలోని ఒక ప్రధాన సభ్యుడిని బీమా లబ్ధిదారుడిగా…

ప్రజావాణిలోఫిర్యాదుతో పార్కును కాపాడిన హైడ్రా

ప్ర‌జావాణిలో వ‌చ్చిన ఫిర్యాదుల‌ను వెనువెంట‌నే ప‌రిష్క‌రించేందుకు హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలో  ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి పార్క‌లు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాలతో పాటు చెరువును హైడ్రా కాపాడుతున్నారు. వాటి చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అన్నోజిగూడ గ్రామంలోని సర్వే నంబర్లు 94, 95లో ఉన్న 3,400 చదరపు గజాల ప్రజావసరాల స్థలాన్ని హైడ్రా అధికారులు పరిరక్షించారు. ఈ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయంటూ అందిన ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో…

మహిళల వేధింపులపై షీ టీమ్స్ ఉక్కుపాదం

 మహిళలు, బాలికల వేధింపులపై జీరో టాలరెన్స్ విధానంతో చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ తెలిపారు. 2026 అక్టోబర్‌లో షీ టీమ్స్ నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లలో 206 మంది పట్టుబడ్డారు. మొత్తం 220 ఫిర్యాదులు అందగా, 61 ఫోన్ వేధింపులు, 70 సోషల్ మీడియా వేధింపులు, 89 ప్రత్యక్ష వేధింపులకు సంబంధించినవి ఉన్నాయి. వీటిపై 14 క్రిమినల్ కేసులు, 106 పెట్టీ కేసులు నమోదు చేశారు. మరో 96 మందికి ఎల్బీనగర్ పోలీస్ కమిషనర్…

కాంగ్రెస్ హామీలు అమలు చేయకుంటే రాహుల్ పర్యటన అడ్డుకుంటాం

BVHPS రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ వెల్లడించారు ఎన్నికల్లో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలి. ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ప్రత్యేక సంక్షేమ శాఖ పథకాలు, బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీ, స్వయం ఉపాధి రుణాలు వెంటనే మంజూరు చేయాలి. లేనిపక్షంలో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని BVHPS రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ ఆదేశాల మేరకు వికారాబాద్…

మతాలు వేరైనా మానవత్వం ఒక్కటే.. క్రైస్తవ ధరూర్ జాతర వెళ్తున్న భక్తులకు సేవలందించిన

మతాలు వేరైనా మనసులు మంచివైనప్పుడే సమాజంలో ఐక్యత, సోదరభావం వెల్లివిరుస్తాయని సంగారెడ్డి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు మొహమ్మద్ ముల్తాని అన్నారు. ప్రజలు భక్తి మార్గంలో నడుస్తూ దైవాన్ని ఆరాధించినప్పుడే మనశ్శాంతి లభిస్తుందని పేర్కొన్నారు.శుక్రవారం జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని మనియార్‌పల్లి గ్రామం మీదుగా క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే ధరూర్ 104వ జాతరను పురస్కరించుకొని పాదయాత్రగా బయలుదేరిన క్రైస్తవ సోదర సోదరీమణులకు మొహమ్మద్ ముల్తాని సేవలందించారు. ఈ సందర్భంగా పాదయాత్రికులకు చల్లటి పానీయాలు, అన్నం పొట్లాలను పంపిణీ చేశారు.ఈ…

బొల్లంపల్లి కొత్తచెరువు కట్టకు బ్లాస్టింగ్ ముప్పు.! గ్రామస్తుల ఆందోళన.!

వెల్దండ,నవంబర్ 13 :నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బొల్లంపల్లి కొత్తచెరువు పక్కనే ఉన్న క్రషర్ మిషన్, పొలం గట్టు గుట్టకు పెడుతున్న బ్లాస్టింగ్ కారణంగా చెరువు కట్టకు మరియు అలుగుకు ప్రమాదం జరుగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.బ్లాస్టింగ్ ధాటికి అలుగు ముందర భాగంలో కింద ఉన్న సిమెంట్ కాంక్రీట్ పెచ్చులు లేచిపోయిందని గ్రామస్తులు చెబుతున్నారు.ఇదే విధంగా బ్లాస్టింగ్ కొనసాగితే చెరువు కట్టకు, అలుగుకే ప్రమాదం ఏర్పడి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పచ్చని ప్రకృతితో కలకలలాడే…

ఫాక్స్ సాగర్ బాధితులను పరామర్శించిన ఈటల రాజేందర్..

దూలపల్లి గ్రామ పరిధిలోని 121, 124, 125 మరియు 126 సర్వే నంబర్ పరిధిలో,  1995 సంవత్సరంలో చేసిన శ్రీ వెంకటేశ్వర కాలనీ వెంచర్ మరియు ఇతర ప్లాట్లను ఫాక్స్ సాగర్ బఫర్ జొనులో ఉందని హైడ్రా ఆపాదిస్తూ అక్కడి నిర్మాణాలను మరియు రోడ్లను తొలగించి ఫాక్స్ సాగర్ సుందరీకరణ పనులు చేపట్టారు. దీనికి నిరసనగా ప్లాట్ల యజమానులు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొని బాధితులకు అండగా నిలిచారు. ఈ…

డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి

 చింతల్‌లోని భాగ్యరధి డిగ్రీ కళాశాలలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘నషా ముక్త యువ – నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జీడిమెట్ల ఎస్‌ఐ గంగాధర్ మాట్లాడుతూ యువత గంజాయి, డ్రగ్స్‌ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్‌ విక్రయాలు, వినియోగంపై పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రిన్సిపాల్ నవీన్ రాజ్ విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. సామాజిక కార్యకర్త…