మహిళలు, బాలికల వేధింపులపై జీరో టాలరెన్స్ విధానంతో చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ తెలిపారు. 2026 అక్టోబర్లో షీ టీమ్స్ నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లలో 206 మంది పట్టుబడ్డారు. మొత్తం 220 ఫిర్యాదులు అందగా, 61 ఫోన్ వేధింపులు, 70 సోషల్ మీడియా వేధింపులు, 89 ప్రత్యక్ష వేధింపులకు సంబంధించినవి ఉన్నాయి. వీటిపై 14 క్రిమినల్ కేసులు, 106 పెట్టీ కేసులు నమోదు చేశారు. మరో 96 మందికి ఎల్బీనగర్ పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. బాధితులు భయపడకుండా ఫిర్యాదు చేయాలని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ భరోసా ఇచ్చారు.