కాంగ్రెస్ హామీలు అమలు చేయకుంటే రాహుల్ పర్యటన అడ్డుకుంటాం
- కాంగ్రెస్ హామీలు అమలు చేయకుంటే రాహుల్ పర్యటన అడ్డుకుంటాం - November 14, 2026
- పోలీస్ స్టేషన్ ముందు కోల్కొంద సర్పంచ్ ధర్నా - November 13, 2026
- మోమిన్ పేట్ మండల భారత వికలాంగుల హక్కులపరిరక్షణ సమితి అధ్యక్షునిగా దావలిజి గానిమియా - November 5, 2026
BVHPS రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ వెల్లడించారు ఎన్నికల్లో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలి. ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ప్రత్యేక సంక్షేమ శాఖ పథకాలు, బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ, స్వయం ఉపాధి రుణాలు వెంటనే మంజూరు చేయాలి. లేనిపక్షంలో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని BVHPS రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ హెచ్చరించారు. దివ్యాంగులకు సమాన హక్కులు, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, దివ్యాంగుల రాజ్యాధికారమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

