రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all) దూలపల్లి గ్రామ పరిధిలోని 121, 124, 125 మరియు 126 సర్వే నంబర్ పరిధిలో, 1995 సంవత్సరంలో చేసిన శ్రీ వెంకటేశ్వర కాలనీ వెంచర్ మరియు ఇతర ప్లాట్లను ఫాక్స్ సాగర్ బఫర్ జొనులో ఉందని హైడ్రా ఆపాదిస్తూ అక్కడి నిర్మాణాలను మరియు రోడ్లను తొలగించి ఫాక్స్ సాగర్ సుందరీకరణ పనులు చేపట్టారు. దీనికి నిరసనగా ప్లాట్ల యజమానులు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొని బాధితులకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ 1995 సంవత్సరంలో గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చిన లేఅవుట్ ప్లాట్ కొనుక్కుని, గతంలో ఎల్.ఆర్.ఎస్ కట్టి ప్లాట్లను పునరుద్ధించుకుని, ఇల్లు కట్టుకుని, అనేక సంవత్సరాలుగా పన్నులు చెల్లిస్తున్న వీరికి, నివసించే భాగ్యం లేకుండా ఇలాంటి నీతిమాలిన పని చేయడానికి ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి. రాజ్యంగా బద్ద పదవిలో ఉంటూ గౌరవ హైకోర్టు ఇచ్చిన స్టేను విస్మరించి, అనేక అబద్దాల ఆడుతున్న రంగనాథ్, ఇకనైనా రేవంత్ రెడ్డి చెంచాగిరి మానుకో. ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉండదు అని హెచ్చరించారు. ఈ ప్రభుత్వానికి అంతగా సుందరీకరణ చేయాలనుకుంటే ఇక్కడి ప్లాట్ల యజమానులతో చర్చించి, మార్కెట్ విలువ ప్రకారం వారికి డబ్బులు ఇవ్వాలని తెలిపారు. కాదని పోలీసు బలగాలతో గుండగిరి చేస్తే ఊరుకునేదిలేదు, బాధితులకు ఎప్పుడూ భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గిరివర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఆదిరెడ్డి రాజిరెడ్డి, స్థానిక బిజెపి అధ్యక్షులు సతీష్ సాగర్, బీజేపీ నాయకులు సరిత రావు, మధు, ఆకుల శ్రీను, అశ్విన్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
