దీపావళి చోరీలు,నలుగురు అరెస్ట్‌.. రూ.50 లక్షల స్వాధీనం

  • వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నాలుగు ఇళ్ల దొంగతనాలకు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 21 తులాల బంగారం, 15 గ్రాముల వజ్రాలు, 54 తులాల వెండి ఆభరణాలు, రూ.9 లక్షల నగదు కలిపి సుమారు రూ.50 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సచివాలయ నగర్‌లో దీపావళి సందర్భంగా కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో చోరీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఐదు సెల్‌ఫోన్లు, బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

You may also like...