పింఛన్ లబ్ధిదారుల ఇంట వెలుగులు.. అర్హులందరికీ ప్రభుత్వ భరోసా: ఎమ్మెల్యే కసిరెడ్డి.!

1001361809.jpg

కల్వకుర్తి నవంబర్ 14:ఎంతోకాలంగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు కల్వకుర్తి నియోజకవర్గంలో పింఛన్ల పండుగ మొదలైంది.నూతనంగా మంజూరైన పింఛన్ల పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. గీత కార్మికులు, దివ్యాంగులు,ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు తదితర అర్హులైన వర్గాలకు పింఛన్లు అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అర్హులైన పలువురికి పింఛన్లు అందలేదని పేర్కొన్నారు. ఇప్పటికే 3,600 మందికి తొలి విడతలో, మరో 2,000 మందికి రెండో విడతలో పింఛన్లు అందించినట్లు తెలిపారు. మూడేళ్లలో సుమారు 1,600 అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. కల్వకుర్తిలో 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ఆమనగల్లులో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి మంజూరు చేయించి నిర్మాణ పనులు చేపడుతున్నామని వివరించారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని,అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్,మండల పార్టీ అధ్యక్షుడు బాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి,వైస్ చైర్మన్ షానవాజ్ ఖాన్,మార్కెట్ కమిటీ చైర్మన్ మనీలా సంజీవ్ కుమార్ యాదవ్,వెల్దండ మండల పార్టీ అధ్యక్షుడు హరికిషన్ నాయక్,కల్వకుర్తి సింగిల్ విండో చైర్మన్ హరీశ్వర్ రెడ్డి, వెల్దండ పీఏసీఎస్ చైర్మన్ భూపతిరెడ్డి, ఆత్మ కమిటీ సభ్యుడు సుదర్శన్ రెడ్డి, కౌన్సిలర్లు,సర్పంచులు యాదమ్మ వెంకటయ్య గౌడ్, భాగ్యమ్మ పూల్ సింగ్, ప్రసాద్ గౌడ్, సంగీత శేఖర్ రెడ్డి,మొక్తాల రమేష్,గన్యా నాయక్,సబవత్ రమేష్ నాయక్,వివిధ గ్రామాల సర్పంచులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

You may also like...