ఘనంగా రాష్ట్రస్థాయి సెపక్ తక్రా టోర్నమెంట్ ముగింపు వేడుకలు

WhatsApp Image 2026-11-14 at 21.14.43.jpeg

జనగామ మినీ స్టేడియంలో 70వ స్కూల్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-14 బాలబాలికల సెపక్ తక్రా టోర్నమెంట్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి-శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విజేత క్రీడాకారులకు జ్ఞాపికలు, బహుమతులు అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి జనగామకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో క్రీడా సంఘాల ప్రతినిధులు, ఫెడరేషన్ సభ్యులు, కోచ్‌లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

You may also like...