Category: జిల్లా వార్తలు

ఆర్.ఆర్. విద్యార్థుల క్రీడా ప్రభంజనం.. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం క్రీడారంగంలో ఆర్.ఆర్. విద్యార్థులు  రాష్ట్రస్థాయిలో  అద్భుత ప్రతిభ సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. అండర్-14, అండర్-17 విభాగాల్లో వాలీబాల్ పోటీలతో పాటు లాంగ్ జంప్‌లో విద్యార్థులు విశేష ప్రతిభను చాటుకున్నారు.ఈ పోటీల్లో వర్ణిక, నిహారిక, మధు ప్రసన్నలు తమ ప్రతిభతో ఉత్తమ విజయాలను సాధించి  బహుమతులు కైవసం చేసుకున్నారు. విద్యార్థులు సాధించిన ఈ విజయాల పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. నరేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు టి….

ప్రజా పాలనలో ఇందిరమ్మ భీమా

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నాగరాజ్ గౌడ్ మారెడ్డి, బీబీపేట్ నవంబర్,16; తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం మరో చారిత్రాత్మక సంక్షేమ పథకం నవంబర్ 19 నాడు “ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం” ప్రవేశ పెట్టడం పట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ హర్ష్యం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ఇందిరమ్మ కుటుంబ బీమా” పథకం ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి 5 లక్షల ఆర్థిక…

చేయూత పెన్షన్ల మంజూరీ పత్రాల స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన జహిరాబాద్ ఎంపీ.సురేష్ కుమార్ షెట్కార్

జహీరాబాద్/పస్తపూర్ లోని S.V. ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన జహీరాబాద్ మండలానికి మరియు పట్టణానికి కొత్తగా మంజూరైన నూతన పెన్షన్ పత్రాలను మరియు స్మార్ట్ రేషన్ కార్డులను మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా||ఏ.చంద్రశేఖర్  లబ్దిదారులకు పంపిణీ చేశారు..ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం…

వెల్దండలో వరుస చోరీలు.. మూడు ఇళ్లలో దొంగల చేతివాటం!

వెల్దండ, నవంబర్ 16:వెల్దండ మండల కేంద్రంలో గుర్తుతెలియని దొంగలు మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎలెస్కాన్‌పేటకు చెందిన అలివేలు ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌కు వెళ్లగా, దొంగలు తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న రూ.1,500 నగదును అపహరించారు. అనంతరం బీరువాను ఇంటి నుంచి కొంతదూరం ఎత్తుకెళ్లి వదిలేశారు. అలాగే దార రాములు ఇంట్లో ఉన్న…

నీరున్నా.. క్రాప్ హాలిడేనా?

నిజాంసాగర్ ప్రాజెక్టులో 9.1 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నప్పటికీ రబీ పంటలకు క్రాప్ హాలిడే ప్రకటించడం రైతులకు అన్యాయమని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మోరల్ శ్రీనివాసరావు మండిపడ్డారు. రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆయన ఆధ్వర్యంలో రైతులతో కలిసి నిరసన చేపట్టారు. రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి, స్థానిక ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ…

వెల్దండ సర్పంచుకు సీఐ నర్సింహులు ఆత్మీయ సత్కారం.!

వెల్దండ నవంబర్ 15 :గతంలో వెల్దండ మండలంలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందిన ప్రస్తుతం దేవరకొండ సీఐగా విధులు నిర్వహిస్తున్న నర్సింహులు ఆదివారం మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి ఆత్మీయంగా అభినందించారు.గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ చేస్తున్న కృషి, చూపుతున్న చొరవ అభినందనీయమని ఎస్సై నరసింహ్మ పేర్కొన్నారు. గతంలో మండలంలో శాంతిభద్రతల పరిరక్షణలో ఎస్సైగా నరసింహ్మ అందించిన సేవలను గుర్తు…

కల్వకుర్తిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంపై ప్రతిపక్ష సర్పంచ్‌ల అభ్యంతరం.!

కల్వకుర్తిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంపై ప్రతిపక్ష సర్పంచ్‌ల అభ్యంతరం.!

కల్వకుర్తి నవంబర్15:ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం నిర్వహించే చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా జరగాలని ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు సర్పంచ్‌లు అభిప్రాయపడ్డారు.కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరైన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీలకు చెందిన సర్పంచ్‌లను ఆహ్వానించకపోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్‌లు ఏ పార్టీకి చెందిన వారైనా గ్రామ అభివృద్ధి,ప్రజా సమస్యలు,సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.అధికార పార్టీ, ప్రతిపక్షం…

అక్షరాల రూపంలో జీవిత ఆటుపోట్లు.. ‘ఆటుపోట్లు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సుంకిరెడ్డి!

ఆమనగల్, నవంబర్ 15:జీవితంలో ఎదురయ్యే అనుభవాలు, సవాళ్లు, భావోద్వేగాలను అక్షరాల రూపంలో సమాజానికి అందించడం గొప్ప సాహిత్య ప్రక్రియ అని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.ఆమనగల్‌లోని ఐక్యత ఫౌండేషన్ కార్యాలయంలో రచయిత దొబ్బల విష్ణు రచించిన ‘ఆటుపోట్లు’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి రచయిత దొబ్బల విష్ణు సమక్షంలో పుస్తకాన్ని ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒక…

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. కల్వకుర్తి ఐటీఐలో మూడు ఉద్యోగాలు.. ఐదు రోజులే గడువు!

కల్వకుర్తి నవంబర్ 15: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) / అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ) కళాశాలలో ఖాళీగా ఉన్న మూడు అవుట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె. జయమ్మ ఒక ప్రకటనలో తెలిపారు.ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు:అటెండర్ – 01,స్వీపర్ – 01,వాచ్‌మెన్ (సెక్యూరిటీ గార్డు)- 01- ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 16వ తేదీ నుంచి 20వ…