అక్షరాల రూపంలో జీవిత ఆటుపోట్లు.. ‘ఆటుపోట్లు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సుంకిరెడ్డి!
- వెల్దండ సర్పంచుకు సీఐ నర్సింహులు ఆత్మీయ సత్కారం.! - November 15, 2026
- కల్వకుర్తిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంపై ప్రతిపక్ష సర్పంచ్ల అభ్యంతరం.! - November 15, 2026
- అక్షరాల రూపంలో జీవిత ఆటుపోట్లు.. ‘ఆటుపోట్లు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సుంకిరెడ్డి! - November 15, 2026

ఆమనగల్, నవంబర్ 15:జీవితంలో ఎదురయ్యే అనుభవాలు, సవాళ్లు, భావోద్వేగాలను అక్షరాల రూపంలో సమాజానికి అందించడం గొప్ప సాహిత్య ప్రక్రియ అని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.ఆమనగల్లోని ఐక్యత ఫౌండేషన్ కార్యాలయంలో రచయిత దొబ్బల విష్ణు రచించిన ‘ఆటుపోట్లు’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి రచయిత దొబ్బల విష్ణు సమక్షంలో పుస్తకాన్ని ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒక పుస్తకాన్ని రచించడం అంటే కేవలం అక్షరాలను పొందుపరచడం కాదని, తమ ఆలోచనలు, అనుభవాలు, భావాలను సమాజంతో పంచుకునే గొప్ప ప్రయత్నమని పేర్కొన్నారు. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లు మనిషికి ఎన్నో పాఠాలు నేర్పుతాయని, వాటిని అక్షరబద్ధం చేసి పాఠకులకు అందించడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, జగన్, కొండల్ యాదవ్, దొబ్బల బాబురావు, భాస్కర్, ప్రభాకర్, వినయ్, విశ్వ వికాస్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
