రిపోర్టర్, సంగారెడ్డి | 9000600737
Latest posts by MOHAMMAD MOHAMMAD
(see all) జహీరాబాద్/పస్తపూర్ లోని S.V. ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన జహీరాబాద్ మండలానికి మరియు పట్టణానికి కొత్తగా మంజూరైన నూతన పెన్షన్ పత్రాలను మరియు స్మార్ట్ రేషన్ కార్డులను మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా||ఏ.చంద్రశేఖర్ లబ్దిదారులకు పంపిణీ చేశారు..ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు..
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ ఛైర్మెన్ గిరిధర్ రెడ్డి , ఆత్మ కమిటీ చైర్మన్ రామ లింగారెడ్డి జహిరాబాద్ మునిసిపల్ ఛైర్మెన్ యూనుస్ వైస్ చైర్మన్, పట్టణ మండలాల అధ్యక్షులు,మహిళ కాంగ్రెస్ అధ్యక్షులు,కౌన్సిలర్లు, కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు…
