రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నాగరాజ్ గౌడ్ మారెడ్డి, బీబీపేట్ నవంబర్,16; తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం మరో చారిత్రాత్మక సంక్షేమ పథకం నవంబర్ 19 నాడు “ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం” ప్రవేశ పెట్టడం పట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ హర్ష్యం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ఇందిరమ్మ కుటుంబ బీమా” పథకం ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి 5 లక్షల ఆర్థిక భరోసా కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రజా ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమన్నారు
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ప్రజా పాలన సాగిస్తున్న ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో భాగంగా మరో కీలకమైన సంక్షేమ పథకాన్ని ప్రారంభించడమే దీనికి నిదర్శనమన్నారు.కుటుంబంలో అనుకోని కారణాల వల్ల సభ్యులు ఎవరైనా మరణించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా అండగా నిలవాలనే గొప్ప సంకల్పంతో కాంగ్రెస్ పాలనలో రూ.5 లక్షల ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలు చేయనున్నారన్నారు ఈ పథకం ద్వారా ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు, ప్రతి కుటుంబానికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను కల్పించడం ప్రజా పాలన ప్రధాన లక్ష్యమన్నారు ఈ ప్రతిష్టాత్మక ఇందిరమ్మ భీమా సంక్షేమ పథకం ప్రయోజనాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామన్నారు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకే అందిస్తూ సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ద్వారా చేయుతనందిస్తూ కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తామన్నారు ఇందిరమ్మ భీమా సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, మంత్రి వర్గానికి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీకి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లకు లకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు
