హైదరాబాద్‌లో మెడికల్ షాపులపై TG SAFE మెరుపు దాడులు

422658.jpg

హైదరాబాద్.: మత్తును కలిగించే (హాబిట్-ఫార్మింగ్) మందుల అక్రమ విక్రయాలు, యాంటీబయాటిక్స్ విచ్చలవిడి అమ్మకాలను అరికట్టేందుకు తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. CURE రీజియన్‌లో భాగంగా గురువారం నాడు TG SAFE డ్రగ్స్ వింగ్, ఎన్ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు, మరియు ఎక్సైజ్ సిబ్బంది సంయుక్తంగా నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.

కోఠి, అబిడ్స్, బషీర్‌బాగ్, నాంపల్లి, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్, సనత్‌నగర్, ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, మధురానగర్, జూబ్లీహిల్స్, మరియు బంజారాహిల్స్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్న మెడికల్ షాపులపై అధికారులు దాడులు జరిపారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

You may also like...